Wednesday, January 22, 2025

సంప్రదాయ వైద్యంలో ఆలుగు పొలుసుల డిమాండ్

- Advertisement -
- Advertisement -

ఆలుగు, అలుగు, సాలుగు అని పిలిచే పాంగోలిన్ ఏకైక వన్య క్షీరదం. అయితే దీని శరీరంపై ఉండే పొలుసులు( చిప్పలు)కు డిమాండ్ మాత్రం అంతర్జాతీయంగా బాగా ఉంటోంది. శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ వియత్నాం, చైనా, ఘన వంటి దేశాల్లో సంప్రదాయ ఔషధాల్లో చాలావరకు ఆలుగు శరీర భాగాలను, పొలుసులను వినియోగిస్తుంటారు. ఈ పొలుసులు వాడితే చనుబాలు పెరుగుతాయని 79 శాతం వరకు ఔషధాల్లో వినియోగిస్తున్నారు. ఇతర రుగ్మతల నివారణకు 60 శాతం, చీము పట్టకుండా ఉండేందుకు 40 శాతం, చర్మవ్యాధులకు 29 శాతం , క్యాన్సర్ చికిత్సలో 27 శాతం, కీళ్ల నొప్పులు వంటి ఎముకల వ్యాధుల చికిత్సకు 23 శాతం, ఆస్తా నివారణకు 8 శాతం సంప్రదాయ వైద్య రంగంలో ఆలుగుకు డిమాండ్ కనిపిస్తోంది. ఇంతేకాదు బూట్లు, సంచులు, బెల్టుల తయారీలో, రెస్టారెంట్లలో మాంసం వంటకాల్లో ఆలుగు మాంసం ప్రత్యేక ఆహారంగా అందిస్తున్నారు. ధనికులు ఆలుగు మాంసం తినడం కానీ, వీటి పొలుసులతో బూట్లు, ఇతర పరికరాలు తయారు చేయించుకోవడం తమ హోదాగా భావిస్తుంటారు.

వియత్నాంలో సంప్రదాయ వైద్యులు తమ ప్రాక్టీస్‌లో రోగులకు ఆలుగు వైద్యం ఆధారంగా చికిత్స చేయడం పరిపాటి. వీటి రవాణా, వినియోగం నియంత్రణ కోసం ఎన్ని చట్టాలున్నా ఖాతరు చేయడం లేదు. కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందిన సమయంలో జంతువుల నుంచి కరోనా మనుషులకు సంక్రమిస్తోందని భయాందోళనలు చెలరేగాయి. కానీ సంప్రదాయ వైద్యం వైపు ఈ వన్య ప్రాణుల డిమాండ్ వివరీతంగా సాగడం విశేషం. అందుకనే వన్య ప్రాణుల అక్రమ రవాణాలో ఆలుగు ప్రధమ స్థానంలో ఉంటోంది. ఆలుగులో ఎనిమిది రకాల తెగలు ఉన్నాయి.

ఇవి అంతరించే జాబితాలో ఉన్నాయి. భారత దేశంలో 2018 నుంచి 2022 మధ్య కాలంలో వన్యప్రాణుల అక్రమ రవాణాలో 1203 ఆలుగులు ఉన్నాయి.24 రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ వీటి అక్రమ రవాణా సాగుతోంది. ఈమేరకు ఒడిస్సాలో అత్యధికంగా వీటి అక్రమ రవాణా సాగుతోంది. ఈ విధంగా గత ఐదేళ్లలో దాదాపు వెయ్యికి మించి ఆలుగులు అక్రమంగా రవాణా అయ్యాయి. 2009 నుంచి 2017 మధ్య కాలంలో 6000 ఆలుగులు తరలిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా 2019 లో దాదాపు రెండు లక్షల ఆలుగులు అక్రమంగా రవాణా అయ్యాయి. నైజీరియా కస్టమ్స్ అధికారులు 2021 లో ఏడు టన్నులకు పైగా ఆలుగు చిప్పలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 18న ప్రపంచ మంతా పాంగోలిన్ సంరక్షణ సంకేతంగా దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News