Friday, December 20, 2024

కొత్తదనం ఉన్న మాస్ సినిమా..

- Advertisement -
- Advertisement -

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదికేశవ’తో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. “ఇది పూర్తి స్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది.

ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు ఓ మంచి సినిమా చూశామనే ఆనందంతో థియేటర్ల నుంచి బయటకు వస్తారు” అని అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి, నటులు జయప్రకాశ్, సుదర్శన్, రచ్చ రవి, గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News