Tuesday, January 21, 2025

కథలో కొత్తదనమున్న మాస్ సినిమా

- Advertisement -
- Advertisement -

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ’ఆదికేశవ’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ “కథ నచ్చి ఈ సినిమా చేశాను. నాకు తెలిసినదల్లా కష్టపడి నిజాయితీగా పని చేయడమే.. ఫలితం గురించి ఆలోచించి ఏదీ చేయను.

పవన్ కళ్యాణ్ కూడా నాతో… నటుడు అనిపించుకుంటేనే విభిన్న పాత్రలు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ల నుంచి ఆనందంగా బయటకు వస్తారు.యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించాం. ఫైట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ ఉండవు. కొడితే పది మంది గాలిలో ఎగరడం అలాంటివి ఉండవు.

నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి. దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నాకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్‌గా ఉంటాయి. సంభాషణలు సహజంగా సరదాగా ఉంటాయి. షూటింగ్ టైంలో ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. పాత్రలోని అమాయకత్వం, తింగరితనంతో దర్శకుడు శ్రీకాంత్ హాస్యం రాబట్టారు. జి.వి. ప్రకాష్‌తో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మెలోడీ అయినా, మాస్ బీట్ అయినా ఏదైనా ఇవ్వగలరు. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఇస్తారు” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News