జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు
ఐదుగురు జిఎస్‌టి అధికారులపై కేసు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు పంజాగుట్ట పోలీసులు ఐదుగురు జిఎస్‌టి అధికారులపై కేసు నమోదు చేశారు. సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారంటూ రాఘవిరెడ్డి అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే…వ్యాపారవేత్త సత్య శ్రీధర్ రెడ్డి కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జిఎస్‌టి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈక్రమంలో సోదాల అనంతరం శ్రీధర్ రెడ్డి భార్య రాఘవి రెడ్డిని జిఎస్‌టి అధికారులు అక్రమంగా నిర్బంధించారు.దీంతో ఫిబ్రవరి 27, 2019 రోజున తనని సెర్చ్ ఆపరేషన్ పేరుతో నిర్భధించిన జిఎస్‌టి అధికారులపై రాఘవిరెడ్డి జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
ఈ కేసుపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని నేషనల్ మహిళా కమిషన్ హైదరాబాద్ పోలీసులకు సిఫార్స్ చేయడంతో ఐదుగురు జిఎస్‌టి అధికారులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బోలినేని గాంధీ, చిలుక సుధ రాణి, ఇసాబెల్లా, ఆనంద్ కుమార్, కుచ్‌లపై పోలీసులు ఎప్‌ఐఆర్ నమోదు చేశారు. గతంలోనే బొల్లినేని గాంధీపై సీబీఐ కేసు నమోదైన విషయం విదితమే. ఇప్పటికే బొల్లినేని గాంధీ, చిలక సుధాలు సస్పెన్షన్‌లోనే ఉన్నారు. కేసు విచారణలో భాగంగా బొల్లినేని గాంధీపై గతంలో నమోదైన కేసు వివరాల కోసం పంజాగుట్ట పోలీసులు సిబిఐని ఆశ్రయించారు.
Panjagutta Police Case filed against 5 GST Officials