ఐటిబిపి డిజిగా సంజయ్‌అరోరా బాధ్యతలు
న్యూఢిల్లీ: బిఎస్‌ఎఫ్ నూతన డైరెక్టర్ జనరల్(డిజి)గా పంకజ్‌కుమార్‌సింగ్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఐటిబిపి నూతన డైరెక్టర్ జనరల్(డిజి)గా సంజయ్‌అరోరా కూడా అదేరోజు బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరూ 1988బ్యాచ్ ఐపిఎస్ అధికారులు. సింగ్ రాజస్థాన్ కేడర్‌కు చెందినవారు కాగా, అరోరా తమిళనాడు కేడర్‌కు చెందినవారు. పాకిస్థాన్,బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని 6300 కిలోమీటర్లమేర పహారా కాసే బిఎస్‌ఎఫ్‌కు సింగ్ నేతృత్వం వహిస్తారు. బిఎస్‌ఎఫ్‌లో 2.65 లక్షలమంది సిబ్బంది ఉన్నారు. చైనాతో ఉన్న వాస్తవాధీనరేఖ(ఎల్‌ఎసి)లోని 3488 కిలోమటర్లమేర విస్తరించిన సరిహద్దును కాపాలాకాసే ఐటిబిపి దళాలకు అరోరా నేతృత్వం వహిస్తారు. ఐటిబిపిలో 90,000మంది సిబ్బంది ఉన్నారు. సింగ్ 2022 డిసెంబర్‌లో రిటైర్ కానున్నారు. అరోరా 2025 జులైలో రిటైర్ కానున్నారు. పంకజ్‌కుమార్‌సింగ్ తండ్రి ప్రకాశ్‌సింగ్ కూడా 1993 నుంచి 1994 వరకు బిఎస్‌ఎఫ్ డిజిగా పని చేశారు. కేంద్ర బలగాలకు తండ్రీ,కొడుకు డిజిస్థాయిలో పని చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.