Tuesday, September 17, 2024

యూపీ ఎన్‌కౌంటర్‌లో పంకజ్ యాదవ్ హతం

- Advertisement -
- Advertisement -

కాంట్రాక్టర్ మన్నాసింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన పంకజ్‌యాదవ్‌పై యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) కాల్పులు జరిపింది. ఈ నేరస్తునిపై లక్షరూపాయలు రివార్డు ఉంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. బీఎస్పీ మాజీ ఎమ్‌ఎల్‌ఎ ముక్తార్ అన్సార్, మాఫియా షహబుద్దీన్‌లకు పంకజ్ యాదవ్ షూటర్‌గా పనిచేశాడు. డబ్బుల కోసం హత్యలుచేసి కాంట్రాక్టు కిల్లర్‌గా పేరొందాడు. ఈ సంఘటన గురించి పోలీస్‌లు మీడియాకు వివరించారు. మధుర ఆగ్రా హైవే లోని పర్హా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగిందని, ఎస్‌టిఎఫ్ తమకు తెలియజేసిందని, పంకజ్ యాదవ్ తన సహచరుల్లోని ఒకరితో కలిసి బైక్‌పై ఆగ్రావైపు వెళ్తున్నట్టు ఇన్‌ఫార్మర్ నుంచి పోలీస్‌లకు సమాచారం అందిందని చెప్పారు.

దీంతో ఎస్‌టీఎఫ్ బృందం అతనిని వెంబడించింది. అతను గ్రామం వైపు పరిగెడుతూ ఎస్‌టిఎఫ్ బృందంపై కాల్పులు ప్రారంభించాడు. దీనికి ప్రతిగా ఎస్‌టిఎఫ్ కూడా కాల్పులు జరిపింది.న ఈ ఎన్‌కౌంటర్‌లో పంకజ్‌యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని సహచరుడు సంఘటన స్థలం నుంచి పారిపోయాడు. గాయపడిన పంకజ్‌ను మధుర జిల్లా ఆస్పత్రికి తరలించగా, అక్కడ మృతిచెందినట్టు వెద్యులు ప్రకటించారు. సంఘటన స్థలం నుండి ఒక పిస్టల్, రివాల్వర్, ద్విచక్ర వాహనాన్ని పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. తాహిరాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని రాణిపూర్ గ్రామ నివాసి అయిన పంకజ్‌సింగ్‌కు మన్నాసింగ్ హత్యలో ప్రమేయం ఉంది. పంకజ్ యాదవ్‌పై హత్య, దోపిడీ తదితర 36 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News