- Advertisement -
ముంబై: మహారాష్ట్ర శాసనమండలిలోని 10 స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం ఐదుగురు అభ్యర్థులను బిజెపి బుధవారం ప్రకటించింది. అయితే..బిజెపి దివంగత నాయకుడు గోపీనాథ్ ముండే కుమార్తె, మాజీ మ్రంతి పంకజ ముండే పేరు ఈ జాబితాలో లేకపోవడం చర్చనీయాంశమైంది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సమీప బంధువు, ఎన్‌సిపి అభ్యర్థి ధనంజయ్ ముండే చేతిలో పరాజయం పాలైన పంకజను ఎంఎల్‌సి పదవికి బిజెపి ఎంపిక చేయవచ్చని ఊహాగానాలు గతంలో సాగాయి. తాజా జాబితాలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అనుయాయులకే చోటు దక్కడం గమనార్హం. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయనకు ఓఎస్‌డిగా పనిచేసిన శ్రీకాంత్ భారతీయకు తాజా జాబితాలో చోటు దక్కడం విశేషం. జూన్ 20న 10 ఎంఎల్‌సి ఖాళీలకు ఎన్నికలు జరగనున్నాయి.
- Advertisement -