Thursday, November 21, 2024

టీమిండియాకు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

టీమిండియాకు ఎదురుదెబ్బ.. పంత్, జడేజాలకు గాయాలు

సిడ్నీ: మూడో టెస్టులో టీమిండియా కష్టాలు రెట్టింపు అయ్యాయి. భారత కీలక ఆటగాళ్లు రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు గాయాలకు గురయ్యారు. ఇద్దరు కూడా మూడో రోజు ఆటలో ఫీల్డింగ్‌కు దిగలేదు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సందర్భంగా పంత్ గాయానికి గురయ్యాడు. కమిన్స్ వేసిన బంతి ఎడమ మోచేతికి బలంగా తాకింది. దీంతో పంత్ నొప్పిని భరించలేక విలవిల్లాడాడు. ఆ తర్వాత ప్రథమ చికిత్స తీసుకున్న పంత్ కొద్ది సేపటికే ఔటయ్యాడు. అప్పటి వరకు పూర్తి ఏకాగ్రతతో బ్యాటింగ్ చేసిన పంత్‌కు గాయం ప్రతికూలంగా మారింది. గాయం నొప్పి వెంటాడడంతో కుదురుగా బ్యాటింగ్ చేయలేక పోయాడు. ఇక ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా పంత్ కీపింగ్‌కు దిగలేదు. అతని స్థానంలో వృద్ధిమాన్ సాహా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ జడేజా కూడా గాయం బారిన పడ్డాడు. ధాటిగా ఆడుతున్న సమయంలో జడేజాకు గాయమైంది. ఆస్ట్రేలియా బౌలర్ విసిరిన బంతి ఎడమ చేతి బొటనవేలికి తగిలింది. దీంతో జడేజా కూడా ఫీల్డింగ్‌కు దిగలేదు. ఇప్పటికే షమి, ఉమేశ్ యాదవ్, రాహుల్‌లు గాయంతో స్వదేశానికి వెళ్లి పోయారు. తాజాగా మూడో టెస్టులో మరో ఇద్దరు గాయం బారిన పడడం జట్టును కలవరానికి గురిచేస్తోంది.

Pant and Jadeja injured in 3rd Test

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News