Sunday, December 22, 2024

ఐపిఎల్ లో పంత్ రికార్డ్.. అతి తక్కువ బంతుల్లో 3వేల పరుగులు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నిన్న(శుక్రవారం) లక్నోతో జరిగిన మ్యాచ్ లో పంత్.. కేవలం 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 41 పరుగులతో రణించాడు. ఈ క్రమంలో పంత్ ఐపిఎల్ లో మొత్తం 3వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. 2028 బంతుల్లో పంత్ 3వేలు పరుగులు సాదించాడు. దీంతో అతి తక్కువ బంతుల్లో మూడు వేల పరుగులు చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా పంత్ రికార్డ్ సృష్టించాడు. పంత్ తర్వాత యూసుఫ్ పఠాన్, సూర్యకుమార్ యాదవ్, సురేష్ రైనాలు ఉన్నారు.

కాగా, నిన్న లక్నోపై 6 వికెట్లు తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఈ సీజన్ లో ఢిల్లీకి ఇది రెండో విజయం మాత్రమే. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News