Saturday, December 21, 2024

హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన పంత్, అయ్యర్

- Advertisement -
- Advertisement -

 

ఢాకా: షీర్ బంగ్లా జాతీయ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టులో రెండో రోజు భారత జట్టు 60 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 225 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రిషభ్ పంత్(86), శ్రేయస్ అయ్యర్ (57) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఐదో వికెట్‌పై రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ 131 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ మాత్ర ధాటిగా ఆడుతున్నాడు. పంత్ 90 బంతుల్లో 86 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 66 బంతుల్లో 57 పరుగులు చేశాడు. భారత్ బ్యాట్స్‌మెన్లు కెఎల్ రాహుల్ (10), శుభ్‌మన్ గిల్ (20), ఛటేశ్వర్ పూజారా(24), విరాట్ కోహ్లీ(24) పరుగులు చేసి ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ మూడు వికెట్లు తీసి భారత జట్టు నడ్డి విరిచాడు. టష్కిన్ అహ్మాద్ ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News