- Advertisement -
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రవేశ పెట్టిన ఈ నెల మేటి ఆటగాడు తొలి పురస్కారాన్ని టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో అసాధారణ రీతిలో రాణించిన పంత్‌కు ఈ అవార్డు లభించింది. జనవరి నెలకు సంబంధించి అవార్డులో పంత్‌కు అత్యధిక సంఖ్యలో ఓట్లు వచ్చాయి. దీంతో అతనికే క్రికెటర్ అఫ్‌ది మంత్ అవార్డు దక్కింది. సిడ్నీ టెస్టులో (97), బ్రిస్బేన్ టెస్టులో 89 (నాటౌట్) పరుగులతో పంత్ చెలరేగిన విషయం తెలిసిందే. ఇక మహిళల విభాగంలో ఈ అవార్డును దక్షిణాఫ్రికా క్రికెటర్ షబ్నమ్ ఇస్మాయిల్ సొంతం చేసుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇస్మాయిల్ ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ఇస్మాయిల్‌కు మహిళల విభాగంలో అవార్డు వరించింది.
- Advertisement -