జిప్ తీస్తే లైంగిక వేధింపు కాదు: బొంబాయి హైకోర్టు మరో తీర్పు
నాగ్‌పూర్: దుస్తుల మీద నుంచి శరీర భాగాలను స్పృశించడం లైంగిక వేధింపుల పరిధిలోకి రాదని బొంబాయి హైకోర్టు మరో తీర్పు వెలువరించింది. ఈ న్యాయస్థానపు ఇదే బెంచ్ న్యాయమూర్తి ఇప్పుడు ఇటువంటి కేసులోనే బాలిక జిప్ తీస్తే పోస్కో చట్టం పరిధిలోకి రావడం జరగదని, శిక్షార్హమైన నేరం కాదని మరో తీర్పు వెలువరించడం ఇప్పుడు సంచలనం కల్గించింది. ఈ నెల 15న తిరిగి ఈ నెల 19వ తేదీన హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో నిందితులు ఇద్దరూ నిర్దోషులని పేర్కొన్నారు. ప్యాంట్ జిప్ విప్పడం, బాలిక శరీరభాగాలను దుస్తుల నుంచి తడమడం శిక్షార్హమైన నేరం ఏమీ కాదని జనవరి 19న సింగిల్ బెంచ్ మహిళా న్యాయమూర్తి పుష్ప గనేడివాలా తీర్పు ఇచ్చారు. నిందితుడికి పడ్డ శిక్షను కొట్టివేశారు, ఇది వివాదాస్పదం కావడంతో సుప్రీంకోర్టు దీనిపైస్టే ఇచ్చింది, అయితే ఇదే బెంచ్ న్యాయమూర్తి నాలుగురోజుల ముందు ఇటువంటి తీర్పు ఇచ్చినట్లు ఇప్పుడు వెల్లడైంది, మైనర్ చేతులు పట్టుకోవడం, జిప్ తీయడం లైంగిక వేధింపుల నుంచి చిన్నారులను రక్షించడానికి తీసుకువచ్చిన చట్టం (పోక్సో) పరిధిలోకి రాదని ఈ న్యాయమూర్తి తెలిపారు.
బాలికలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఒకే ధర్మాసనం ఇటువంటి రెండు సారూప్య తీర్పులు వెలువరించడం కీలకమైన పరిణామం అయింది. ఈ కేసుకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2018 ఫిబ్రవరి 12న కుజూర్ అనే 50 ఏళ్ల వ్యక్తి ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ సమయంలో ఇం ట్లో 5 ఏళ్ల బాలిక ఒక్కతే ఉంది. తల్లి ఇంటికి వచ్చేసరికి ఆ వ్యక్తి బాలిక చేతులు పట్టుకున్నట్లు, ప్యాంట్ జిప్ తీసివేసినట్లు గుర్తించింది. దీనితో సెషన్స్ కోర్టు కు వెళ్లగా అక్కడ నిందితుడికి ఐదేళ్ల శిక్ష పడింది. ఈ వ్యక్తి ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 15వ తేదీన తీర్పు వెలువడింది. లైంగికంగా దాడిచేయాలని అనుకుని భౌతికంగా తాకినప్పుడే పోక్సో చట్టం పరిధిలో శిక్షకు వీలుంటుందని ధర్మాసనం తెలిపింది. దుస్తుల పై నుంచి తడమడం లైంగిక వేధింపుల పరిధిలోకి రాదని, శిక్ష అనుచితమని తెలిపింది. పోక్సో చట్టం పరిధిలో శిక్షను మినహాయించి, ఇతర సెక్షన్ల పరిధిలో నేరానికి ఐదు నెలల శిక్ష విధించారు.
Pant Zip not sexual harassment: Bombay High Court