Monday, December 23, 2024

పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకుడు భీంసింగ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Panthers Party founder Bhim Singh passes away

జమ్మూ: జమ్మూ కశ్మీరు జాతీయ పాంథర్స్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ భీంసింగ్ మంగళవారం కన్నుమూశారు. ఆయనకు 81 సంవత్సరాలు. గత నెలరోజులుగా అస్వస్థతతో జిఎంసి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీంసింగ్ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య జైమాల, కుమారుడు లంకిత్ లవ్ ఉన్నారు. వారిద్దరూ లండన్‌లో నివసిస్తున్నారు. ఉధంపూర్ జిల్లాలోని భుగ్తేరియా గ్రామానికి చెందిన భీంసింగ్ గతంలో జమ్మూ కశ్మీరు శాసనసభ్యునిగా ఉన్నారు. భీంసింగ్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. జమ్మూ కశ్మీరు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకునిగా భీంసింగ్‌ను ఆయన కొనియాడారు. లెఫ్టెనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా భీంసింగ్ మృతికి సంతాపం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News