Monday, December 23, 2024

SSC Paper leak: బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు బండి సంజయ్ ను ఖమ్మం జైలుకు తరలించనున్నారు. మంగళవారం అర్ధరాత్రి బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. హన్మకొండ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.

దీంతో సంజయ్ కు ఈ నెల 19వరకు కోర్టు రిమాండ్ విధించింది. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో పోలీసులు మొత్తం 10మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. మిగతా వారు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News