Sunday, April 6, 2025

కూలీలను విమానంలో ఇంటికి పంపిన రైతు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Pappan Singh Gehlot commits suicide

న్యూఢిల్లీ : తనతోపాటు తనవారంతా బాగుండాలనే మంచి మనసున్న ఆదర్శమూర్తి, లాక్‌డౌన్ సమయంలో తన వద్ద పనిచేసే కూలీలను విమానంలో ఇంటికి పంపడమే కాక, తరువాత విమానం ద్వారా తిరిగి రప్పించి అందరి మెప్పులు పొందిన ఢిల్లీ రైతు పప్పన్‌సింగ్ గెహ్లాట్ ( 55) మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అలీపొరా ప్రాంతం లోని తన ఇంటికి ఎదురుగా ఉండే ఆలయం లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య కారణాలతో చనిపోతున్నట్టు ఆయన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. దాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. పుట్టగొడుగులు సాగు చేసే ఆయన ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు.

కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా వలస కార్మికులు తమ ఇళ్లకు వెళ్లడానికి ఎన్ని కష్టాలు పడేవారో తెలిసిందే. వందలాది కిలోమీటర్ల దూరం నడిచి ఇళ్లకు చేరుకునేవారు. కానీ పప్పన్‌సింగ్ మాత్రం తన వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే కూలీలకు ఎలాంటి కష్టం రానీయలేదు. అందరికీ విమానం టిక్కెట్లు కొనుగోలు చేసి దగ్గరుండి విమానం ఎక్కించి బీహార్ లోని వారి స్వస్థలాలకు పంపించారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు మెరుగయ్యాక, తిరిగి విమానం లోనే వారిని ఢిల్లీకి తీసుకెళ్లడం విశేషం. ఇదంతా ఆయన మంచితనానికి నిలువెత్తు సాక్షంగా నిలిచింది. “నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఎందుకంటే జీవితంలో అద్భుతాలు కొత్తవేమీ కాదు”అంటూ 2022 మే 12న ఆయన ట్వీట్‌ని అందరూ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఎంత సానుకూల దృక్పథంతో ఉండేవారో ఈ ట్వీట్ బట్టి అర్థం చేసుకోవచ్చు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News