Friday, December 20, 2024

పూర్ణియా సీటు వదులుకునే ప్రసక్తే లేదు : పప్పుయాదవ్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీహార్‌లో ఇండియా కూటమి సీట్ల లెక్క ఒక కొలిక్కి రావడం లేదు. ఇటీవల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీసం చేసిన పప్పు యాదవ్ పూర్ణియా సీటును ఆశిస్తున్నారు. అయితే ఈసీటున కూటమి భాగస్వామ్య పార్టీ ఆర్జేడీ బీమా భారతికి కేటాయించింది. ఈ నేపథ్యంలో పప్పుయాదవ్ వివాదాన్ని లేవనెత్తారు. అవసరమైతే ఈ ప్రపంచాన్ని వీడేందుకు సిద్ధమౌతాను తప్ప పూర్ణియా లోని ప్రజలకు మాత్రం దూరం కాబోనని స్పష్టం చేశారు.

ఇక్కడ బీజేపీని నిలువరించేందుకు గత 40 ఏళ్ల నుంచి ప్రయత్నిస్తున్నానని, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరానని, తన పోటీపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని ఆయన స్పష్టం చేశారు. పూర్ణియా నుంచి తానెప్పుడూ ఓడిపోలేదన్నారు. పూర్ణియా ప్రజలు తనను సొంత వ్యక్తిలా ఆదరిస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News