Monday, December 23, 2024

బీహార్ కాంగ్రెస్ పార్టీలో పప్పు యాదవ్ పార్టీ విలీనం

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల వేళ బీహార్ కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరగనుంది. ప్రాంతీయ పార్టీ జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది. కాంగ్రెస్ ముఖ్యనేత ప్రియాంక గాంధీ హామీ మేరకు పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశామని జన్ అధికార్ పార్టీ అధినేత రాజీశ్ రంజన్ అలియాస్ పప్పుయాదవ్ ప్రకటించారు. కాంగ్రెస్, ఆర్‌జేడీ కలిసి పోటీ చేయడం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని పప్పుయాదవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికల తరువాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్‌జేడీ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పప్పుయాదవ్‌ను లోక్‌సభ ఎన్నికల బరిలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ , అతని కుమారుడు తేజస్వియాదవ్‌తో పప్పు యాదవ్ సమావేశం అయ్యారు. గత 17 నెలల బీహార్ పాలనలో తేజస్వియాదవ్ మార్క్ కనిపించిందని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News