Friday, December 20, 2024

పపూవా దీవికి మోడీ.. పాదాభివందనంతో అక్కడి ప్రధాని స్వాగతం

- Advertisement -
- Advertisement -

పాదాభివందనంతో అక్కడి ప్రధాని స్వాగతం

పోర్టు మోర్స్‌బై : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జపాన్ నుంచి పపూవా గియానా చేరుకున్నారు. ఈ పసిఫిక్ దీవుల దేశానికి భారతదేశ ప్రధాని రావడం ఇదే తొలిసారి. ప్రధాని మోడీ విమానం దిగగానే పపూవా ప్రధాని జేమ్స్ మారాపే సంప్రదాయబద్ధంగా ప్రధాని మోడీకి పాదాభివందనం చేశారు. పోర్టు మోర్స్‌బైలో ఆయనకు సైనిక గౌరవ వందనం దక్కింది. విమానాశ్రమం వెలుపల భారతీయ సంతతి వారు ఎక్కువ సంఖ్యలో వచ్చారు.

ప్రధానికి అభివాదం చేశారు. స్థానిక గిరిజన వేషాలలో స్వాగతం పలికారు. ప్రధాని మోడీ నవ్వుతూ స్పందించారు. కొందరిని పలుకరిస్తూ సెల్ఫీలు దిగారు. తరువాత ప్రధాని మోడీ తమ ట్వీటులో తనకు దక్కిన ప్రత్యేక ఆదరణ తనకు చిరస్మరణీయంగా ఉంటుందని, ఈ దీవులతో భారతదేశ సంబంధాలు మరింత సమున్నత దిశకు తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు.

సోమవారం ప్రధాని మోడీ, ప్రధాని మరాపే ఆధ్వర్యంలో ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కో ఆపరేషన్ (ఎఫ్‌ఐపిఐసి) మూడో సమ్మిట్ జరుగుతుంది. ఈ వేదికలో పలు చిన్న దీవుల దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సదస్సుకు సహ సారధ్యం వహించాలని తమకు ఆహ్వానం పంపించినందుకు తాను సంతోషిస్తున్నానని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News