- Advertisement -
మర్పల్లి: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిదిలోని మొగ్గిలిగుండ్ల గ్రామంలో వింత పరికరం పడింది. ఈ పరికరానికి చుట్టు కెమెరాలు ఉండడంతో పాటు ప్యారాచూట్ మాదిరిగా ఉంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చూడటానికి తరలివచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. మర్పల్లి మండలం మొగిలిగుండ్లలో ప్రత్యక్షమైన వింత శకటం ఆదిత్య 369 సినిమాలో మాదిరిగా ఉంది. గుండ్రని భారీ శకటం ఎక్కడ నుంచో వచ్చి పంటపొలాల్లో పడడంతో గ్రామస్థులు వింతగా చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిపడిందో? ఏంటోనని భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Video Player
00:00
00:00
- Advertisement -