Sunday, January 19, 2025

నిత్యానంద దెబ్బకు పరాగ్వే అధికారి ఔట్

- Advertisement -
- Advertisement -

అసున్సియన్ : స్వామి నిత్యానంద చేష్టలతో పరాగ్వే దేశ సీనియర్ అధికారి ఒక్కరు పదవి ఊడింది. పేరుకు కైలాస దేశం లేదా దక్షిణ అమెరికా దీవిలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని పేరుపెట్టుకుని నిత్యానంద చలామణిలో ఉన్నారు. ఈ దేశం పేరిట తన వద్దకు ఓ బృందం వచ్చిందని పరాగ్వేలో వ్యవసాయ మంత్రిత్వశాఖలో సీనియర్ అధికారి అయిన అర్నాల్డో ఛమోరో తెలిపారు. పలు పత్రాలు చూపారని, తమది దీవి దేశం అని చెప్పారని, పరాగ్వేకు అన్నివిధాలుగా సహకరిస్తామని చెప్పారని దీనితో తాను ఎంఓయుపై తాను సంతకాలు చేశానని , ఈ బృందం అంతకు ముందు వ్యవసాయ మంత్రి కార్లోస్ గిమెనోజ్‌ను కూడా కలిశారని ఈ అధికారి తెలిపారు. అయితే ముందుగా వీరి గురించి ఆరాతీయకుండా ఒప్పంద పత్రాలపై సంతకాలకు దిగినందుకు ఇప్పుడు తనను పోస్టు నుంచి బర్తరఫ్ చేశారని వాపొయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News