Thursday, January 23, 2025

పక్షవాతంతో ఉన్న వృద్ధురాలి పై అత్యాచారం

- Advertisement -
- Advertisement -

 

పక్షవాతంతో మంచానికే పరిమితమైన 60 ఏళ్ల వృద్ధురాలిపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. మహారాష్ట్రలోని నాసిక్ లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వృద్దురాలు పక్షవాతంతో గత 7 సంవత్సరాల నుంచి మంచానికే పరిమితమైంది. ప్రస్తుతం ఆమె బాగోగులను తన సోదరుడు చూసుకుంటున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆ వృద్ధురాలిపై 22 ఏళ్ల యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్నిబాధితురాలు బుధవారం తన సోదరుడికి చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News