- Advertisement -
విశిష్ట సేవా పురస్కారంతో సత్కారం
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన జావెలిన్‌త్రో ఆటగాడు నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. నీరజ్ చోప్రా సాధించిన విజయానికి గుర్తింపుగా అతనికి పరమ విశిష్ట సేవా పతకంతో సత్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా నీరజ్ ఈ అరుదైన పురస్కారాన్ని అందుకోనున్నాడు. నీరజ్ చోప్రా ఆర్మీలో సుబేదార్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో అతన్ని కేంద్ర విశిష్ట సేవా పతకంతో సత్కరించనుంది.
- Advertisement -