- Advertisement -
సిబిఐ దర్యాప్తు జరిపించాలంటూ పిటిషన్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంమంత్రి అనిత్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన ముంబయి మాజీ పోలీసు కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను హోంగార్డు విభాగానికి బదిలీ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై స్టే విధించడంతో పాటు బదిలీల్లో జరిగిన అవినీతిపై కేశ్ శుక్లా నివేదికపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని పరమ్‌బీర్ ఆ పిటిషన్‌లో కోరారు. ఇక హోంమంత్రి తన ఆరోపణలపై సాక్షాధారాలను నాశనం చేసే అవకాశం ఉన్నందున అంతకు ముందే ఆయనపై నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. తాను హోంమంత్రిపై చేసిన ఆరోపణలను ధ్రువపరిచే సాక్షాల్లో భాగంగా అనిల్ దేశ్‌ముఖ్ నివాసం వద్ద ఉన్న సిసిటీవీ వీడియోలను కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
- Advertisement -