సిటీ బ్యూరో: మాతృత్వం అనేది ఏ స్త్రీకైనా గొప్ప ఒకవరం అయితే మారుతున్న జీవనశైలి, వాతావరణంలో మార్పులు, వృత్తిపరమైన ఒత్తిళ్ల కారణంగా మాతృత్వానికి నోచులేకపోతున్న మహిళలకు సికింద్రాబాద్ ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ ఓ వరంలాంటిందని ప్రముఖ సినీనటి ప్రణీత అన్నారు. ఇక్కడ ఈఏఐ ఆధారిత ఆర్‌ఐ విట్‌నెస్ సిస్టం వంటి సరికొత్త పరిజ్ఞానంతో సంతాన సాఫల్యం సులభతరమని ఆమె పేర్కొన్నారు. మంగళవారం సికింద్రాబాద్ ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్‌లో తొలిసారిగా ఏఐ ఆధారిత ఆర్‌ఐ విట్ నెస్ సిస్టంను సినీ నటి ప్రణీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాతృత్వం పొందలేకపోతున్న మహిళలు ఈ ఆధునిక పద్ధ్దతుల ద్వారా సులభతరంగా సం తాన సాఫల్యం పొందవచ్చని చెప్పారు.
ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సి. జ్యోతి మాట్లాడుతూ ఎన్నోఏళ్లుగా సంతానం కోసం నిరీక్షిస్తున్న మహిళలను కృత్రిమ గర్భధారణ పద్ధతులు ఎంతో ఆదుకుంటున్నాయని చెప్పారు. సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం సరికొత్త పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నామని, మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరమని అన్నారు. వరల్డ్ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో తొలిసారిగా ఏఐ ఆధారిత ఆర్‌ఐ విట్‌నెస్ సిస్టంను సికింద్రాబాద్‌లోని ఎన్ సి ఎల్ బిల్డింగ్ లో ఉన్న ఫర్టీ 9 ఫర్టిలిటీ సెంటర్‌లో ప్రారంభించినట్లు చెప్పారు.
ఫర్టీ 9 ఫెర్టిలిటీ సెంటర్‌లో పిల్లలు కలగకపోవడానికి గల కారణాలను గుర్తించి సరైన రోగ నిర్ధారణ ద్వారా ఆధునిక వైద్య విధానాల సహాయంతో వేగంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. వరల్డ్ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫర్టీ 9 సంతాన సాఫల్యత పరిశోధనా కేంద్రం అత్యాధునిక అడ్వానస్డ్ ఐవీఎఫ్ పద్ధ్దతులపై మహిళలకు 50శాతం రాయితీని క ల్పిస్తున్నట్లు డాక్టర్ సి. జ్యోతి వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఫర్టీ 9 బ్రాంచ్ లలో మహిళలు వినియోగించుకోవచ్చన్నారు. ఇప్పటికేపలు ప్రాంతాల్లో వేలమందికి ఐవిఎఫ్, ఐసిఎస్‌ఐ, ఐఏంఎస్‌ఐ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించినట్లు వివరించారు.