Monday, February 3, 2025

ఈ కథలో తల్లిదండ్రులే హీరోలు

- Advertisement -
- Advertisement -

 

‘పుష్ప’ సినిమాలో నెగటివ్ రోల్ చేసిన ధనుంజయ్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కన్నడలో 8 సినిమాల్లో హీరోగా చేసి 9వ సినిమా శివరాజ్‌కుమార్ చిత్రంలో విలన్‌గా చేశాడు. ఆ చిత్రంలోని డాలీ పేరుతో డాలీ ధనుంజయ్‌గా పాపులర్ అయ్యాడు. ఆయన తాజాగా నటించిన సినిమా ‘బడవ రాస్కెల్’. గీతా శివరాజ్ కుమార్ సమర్పణలో శంకర్ గురు దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఈనెల 18న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో డాలీ ధనుంజయ్ మాట్లాడుతూ “నా నిర్మాణంలో రూపొందిన తొలి సినిమా ఇది. మధ్య తరగతి కథ నేపథ్యంలో సినిమా రూపుదిద్దుకుంది. ఈ కథలో తల్లిదండ్రులే హీరోలు. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకముంది. ఇక నటుడిగా హీరో, విలన్ పాత్రలు రెండూ ఇష్టమే. హీరోకు కొన్ని బౌండరీలు ఉంటాయి. కానీ విలన్‌కు ఉండవు. పర్‌ఫార్మెన్స్‌కు ఎక్కువ అవకాశం ఉంటుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News