Friday, December 20, 2024

కొడుకుని చదివించి సిఐని చేస్తే… ఆస్తి కోసం తల్లిదండ్రులను చితకబాదాడు

- Advertisement -
- Advertisement -
వనపర్తి: కుమారుడిని చదివించి సిఐని చేస్తే ఆస్తి కోసం తల్లిదండ్రులపై తనయుడు దాడి చేశాడు. సిఐ నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని డిజిపికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాధ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల నివసిస్తున్నారు. ఆ దంపతులకు పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి సిఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సిఐగా విధులు నిర్వహిస్తున్నాడు. రఘునాధ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటలు ఉండగా పెద్ద కుమారుడికి 15 ఎకరాలు, చిన్న కుమారుడికి 11 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని దంపతులు తమ దగ్గర పెట్టుకున్నారు. 15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సిఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకా 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ, హింసిస్తున్నాడు. మనస్తాపానికి గురై చిన్నకొడుకు ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నాడు. దీంతో పెద్ద కుమారుడు నాగేశ్వర్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి, చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News