Monday, December 23, 2024

తాతను చేస్తారా? ఐదుకోట్లిస్తారా?

- Advertisement -
- Advertisement -

Parents demanding grandchild or Rs 5 crore in compensation

కొడుకు కోడలుపై ఓ వ్యక్తి దావా

హరిద్వార్ : ఏడాదిలో తనకు మనవడో మనవరాలినో అందించాలి లేదా 5 కోట్ల రూపాయల పరిహారం అయినా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి తన కొడుకు కోడలుపై కేసు దాఖలు చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఎస్‌ఆర్ ప్రసాద్ అనే ఆ వ్యక్తి తన భార్యతో కలిసి ఈ కేసు పెట్టి దీనిని విలేకరులకు తెలిపారు. కొడుకుకు పెద్ద చదువులు చదివించాను, శిక్షణకు అమెరికాకు పంపించాను. ఉన్న డబ్బంతా పోయింది. 2016లో కొడుకుకు పెళ్లయింది. అయితే ఇంతవరకూ వారికి సంతానం కలుగలేదన్నారు. ఆడబిడ్డనా మగబిడ్డనా అనేది తమకు పట్టింపు లేదని తాము తమ కొడుకుకు వారసులను కోరుతున్నామని ఈ దంపతులు తెలిపారు. బిడ్డలు కావాలి. లేదా కొడుకు ఓ రెండున్నర కోట్లు కోడలు ఓ రెండున్నర కోట్లు తమకు ఇవ్వాల్సి ఉంటుందని తమ లాయర్ ఎకె శ్రీవాస్తవ ద్వారా ఈ పరిహారపు నోటీసును వారికి పంపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News