అహ్మదాబాద్ : కుమార్తె ప్రేమవివాహం చేసుకుందన్న ఆవేదనతో తల్లిదండ్రులు, వారి ఇద్దరు కొడుకులు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమార్తె ఏడాది కిత్రం ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తల్లిదండ్రులు అయిష్టంతో బాధపడుతున్నారు. రెండు కుటుంబాలు దళిత వర్గాలకు చెందినవే అయినప్పటికీ తల్లిదండ్రులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. అహ్మదాబాద్ జిల్లా ధోక్లా పట్టణానికి చెందిన కిరణ్ రథోడ్ (52). అతపి భార్య నీతాబెన్ (50),వారి ఇద్దరు కుమారులు హరీష్ (24), హర్‌శీల్ (19) మంగళవారం రాత్రి విషం తాగారు.
అయితే తండ్రి కిరణ్ రథోడ్, పెద్దకొడుకు హరీష్ మృతి చెందారు. భార్య, చిన్న కొడుకు బతికారు. ప్రస్తుతం వీరు చికిత్స పొందుతున్నారు. పొరుగునున్నవారు ఈ సంఘటన తెలుసుకుని అంబులెన్స్‌ను రప్పించారు. తరువాత పోలీస్‌లకు తెలియజేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వారిని చేర్చగా తండ్రి, పెద్దకొడుకు చనిపోయారని డాక్టర్లు వెల్లడించారని తల్లి, చిన్న కొడుకు చికిత్సపొందుతున్నారని ధోక్లా పోలీస్ స్టేషన్ అధికారి చెప్పారు. రథోడ్ కుమార్తె, అల్లుడు, అత్తవారితోసహా మొత్తం 18 మందిపై పోలీస్‌లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.