Saturday, November 23, 2024

కుమారుడిని ముక్కలు ముక్కలుగా నరికి….

- Advertisement -
- Advertisement -

Parents killed son and daughter in Iran

టెహ్రాన్: అత్యంత కర్కశంగా కన్న కుమారుడిని హత్య చేసి ముక్క ముక్కలుగా నరికి వివిధ చోట్ల పారేసిన సంఘటన ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. అక్బర్ ఖొరమదిన్(81), ఇరాన్ ఖొరమ్‌దిన్ (74) అనే దంపతులు ఇరాన్‌లో నివసిస్తున్నారు. ఈ దంపతుల కుమారుడు బాబాక్ ఖొరమ్‌దిన్ సినీ దర్శకుడిగా పని చేస్తున్నాడు. బాబాక్ చికెన్‌తో భోజనం చేస్తుండగా విషం కలిపారు. స్పృహ తప్పిపడిపోయిన తరువాత అతడి చేతులు, కాళ్లు కట్టేశారు. ముఖానికి కవర్ తొడగడంతో అతడు ఊపిరాడక చనిపోయాడు. వెంటనే మృతదేహాన్ని ముక్క ముక్కలుగా నరికి పలు ప్రాంతాల్లో పడేశారు. స్థానికులకు ముక్కలు లభించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణలో బాబాక్‌ను తల్లిదండ్రులు చంపినట్టు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే చంపామని ఒప్పుకున్నారు. కూతురు, అల్లుడిని కూడా తామే హత్య చేశామన్నారు. కూతురు డ్రగ్స్‌కు బానిస కావడంతో అల్లుడు ఆమెను హింసించేవాడు. విద్యార్థినులతో లైంగిక సంబంధం ఏర్పరచుకోవడంతోనే బాబక్ హత్య చేశామని తల్లిదండ్రులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News