Wednesday, November 6, 2024

మూఢభక్తి… ఇద్దరు కూతుళ్లను చంపేసిన ఉన్నత విద్యావంతులు

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులు, తండ్రేమో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్, తల్లేమో ఓ ప్రైవేటు విద్యా సంస్థకు కరస్పాండెంట్, ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. మంత్రాలు, క్షుద్రపూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పురుషోత్తమ్-పద్మజ అనే దంపతులకు అలేఖ్య(27), సాయిదివ్య(22) అనే అమ్మాయిలు ఉన్నారు. అలేఖ్య పిజి చేసింది, సాయి దివ్యకు సంగీతం మక్కువు ఉండడంతో ఎఆర్ రహమాన్ మ్యూజిక్ సెంటర్ లో నేర్చుకుంటుంది. పురుషోత్తమ్ నాయుడు అనే వ్యక్తి మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య పద్మజ ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తోంది. 2020లో శివనగర్‌లో కొత్తగా నిర్మించుకున్న ఇంటిలోనికి ఈ దంపతులు వచ్చారు. హైదరాబాద్ లో ఉంటున్న వారిని పూజల పేరుతో ఇద్దరిని తల్లిండ్రులు ఇంటికి రప్పించారు.  ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజల పేరుతో సాయిదివ్వను శూలంతో పొడచడంతో ఆమె మృతి చెందింది. అనంతరం అలేఖ్యను నోటిలో రాగి చెంబు పెట్టి తలపై డంబెల్‌తో కొట్టి తల్లి చంపేసింది. పురుషోత్తమ్ నాయుడు తనతో పని చేసే ఓ లెక్చరర్‌కు ఈ విషయం చెప్పడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డిఎస్‌పి రవి మనోహరాచారి, సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ దిలీప్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ దంపతులు ఎప్పుడు పూజలు చేస్తుండేవారని స్థానికులు తెలిపారు. దైవభక్తి అనే పిచ్చితో తన కుమార్తెలను ఈ దంపతులు చంపుకున్నారని తెలిపారు. తన కుమార్తెలు మళ్లీ జన్మిస్తారనే ఉద్దేశ్యంతో ఆ పని చేశారని డిఎస్‌పి వెల్లడించారు. దంపతులకు మానసిక సమస్యలు ఉన్నట్టు గుర్తించామని, వాళ్లు ఆత్మహత్య చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని డిఎస్‌పి వివరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News