Monday, January 20, 2025

సామాధులను తవ్వి.. మృతదేహాలపై అత్యాచారాలు

- Advertisement -
- Advertisement -

పాక్ లో మహిళల మృతదేహాలపై అత్యాచారాలు

ఇస్లామాబాద్: మహిళల మృతదేహాలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దారుణ సంఘటన పాకిస్తాన్ లో వెలుగుచూసింది. కామాంధులు శవాలను సైతం వదలడం లేదని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాధులు తవ్వి.. మృతదేహాలపై అత్యాచారాలు చేస్తున్నారని వాపోతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు కొన్ని ప్రాంతాల్లో సమాధుల చుట్టు ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. కుమారైల సమాధుల చుట్టూ కంచెలు వేసినట్లు ఓ పాక్ వార్తా సంస్థ తెలిపింది.

Also Read: చంద్రబాబు నా వెంట్రుక ముక్క కూడా పీకలేరు: కోడాలి నాని

చనిపోయిన వారి మర్యాద కాపాడేందుకు ఇనుపకంచెల ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇలాంటి ఘటనలతో యావత్ దేశం సిగ్గుతో ఉరేసుకోవాలని డెయిలీ టైమ్స్ తెలిపింది. 2011 లో కరాచీలో ముహమ్మద్ రిజ్వాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. 48 మంది మహిళల మృతదేహాలను తవ్వి తీసి అత్యాచారానికి పాల్పడినట్లు తెలింది. పాక్ లో ప్రతి రెండు గంటలకో మహిళపై అత్యాచారం జరుగుతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News