Thursday, December 26, 2024

తంజావూర్లో పరువు హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిని ఇంటికి తీసుకెళ్లి..

- Advertisement -
- Advertisement -

ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిని ఇంటికి తీసుకెళ్లి.. దారుణంగా హత్య చేశారు. తమ పరువు తీసిందనే కోపంతో కన్న తల్లిదండ్రులే… కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంజావూరు జిల్లాలోని పూవలూరుకు చెందిన నవీన్(19), ఐశ్వర్య(19)లు ప్రేమించుకున్నారు. స్కూల్ నుంచి ప్రేమించుకున్నవీరిద్దరూ.. తర్వాత సొంత ఊరు నుంచి తిరుపూర్ కు వెళ్లి ఉద్యోగం చేస్తున్నారు.

తొలుత నవీన్ తిరూర్ కు వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు.. ఆ తర్వాత ఐశ్వర్యను కూడా మరో ప్రైవేటు కంపెనీలో చేర్పించాడు. ఇలా వీరిద్దరూ దాదాపు 20 నెలలు ఒకే రూమ్ లో ఉంటూ సహజీవనం చేశారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, వీరిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో తమ పెళ్లికి తమ పేరెంట్స్ అంగీకరించరని ఎవరికీ తెలియకుండా గతేడాది 31వ తేదీన ఐశ్వర్య, నవీన్ ను పెళ్లి చేసుకుంది.

ఈ క్రమంలో ఐశ్వర్య తల్లిదండ్రులు.. తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి.. నవీన్-ఐశ్వర్యలను గుర్తించిన పోలీసులు.. ఐశ్వర్యను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఇంటికి తీసుకెళ్లిన వారు… వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని తమ పరువుతీసి అవమానించిందని తమ కూతురిపై పెట్రోల్ పోసి నిప్పటించి దారుణంగా హత్య చేశారు.

ఆ తర్వాత తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే, ఐశ్వర్యను హత్య చేసి చంపారంటూ నవీన్ పోలీసలుకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఐశ్వర్య తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News