Monday, January 20, 2025

తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా

- Advertisement -
- Advertisement -

డైరెక్టర్స్ కట్ సినిమా బ్యానర్‌పై వీరబ్రహ్మం నక్కా దర్శకత్వంలో.. తనే స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘నో రామ.. రావణ్స్ ఓన్లీ’. 14 సంవత్సరాల లోపు పిల్లలను సరైన దారిలో పెట్టకపోతే జరిగే పరిణామాల నేపథ్యంలో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో జబర్ధస్త్ పణి చేతుల మీదుగా విడుదల చేశారు. దర్శకుడు వీరబ్రహ్మంతో పాటు అంకిత్ నాయుడు, శివ బలరామ్, తిరుపతి, రిషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దర్శకనిర్మాత వీరబ్రహ్మం నక్కా మాట్లాడుతూ..“తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా ఇది. తమ పిల్లలను సరిగా పెంచకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందనేది.. మంచి సందేశంతో ఈ చిత్రంలో చూపించాము” అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News