Saturday, December 21, 2024

నా కుమారులు ఇబ్బందులు పెడుతున్నారు సారు..

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి/చిట్యాల: కనిపెంచిన కుమారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తనకు న్యాయం చేయాలని ఓ తల్లిదండ్రులు తమ బాధను వెలిబుచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రెస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి వారు మాట్లాడారు. మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన క్యాతం భూమయ్యకు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఉంది, అందరికి పెళ్ళిల్లు అయ్యాయి. కొడుకులకు ఒక్కొక్కరికి నాలుగు ఎకరాల భూమిని పంచి ఇవ్వడం జరిగిందని తెలిపారు. కూతురికి ఒక ఎకరం భూమి పసుపు కుంకుమల క్రింద కట్నంగా ఇచ్చినట్లు తెలిపారు.

తన వద్ద రెండు ఎకరాల భూమి ఉందని, తనకు లక్షల రూపాయల అప్పు ఉందని, దానిని అమ్ముకుందామని అంటే తన కొడుకులు అడ్డుపడి అమ్మనీయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా కొనడానికిక వస్తే అడ్డుపడుతూ తనను మానసికంగా తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. ఇటీవల స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తనకు ఎలాగైన న్యాయం చేయాలని కోరారు. సంబంధిత మండల రెవెన్యూ, జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని భార్యభర్తలు వేడుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News