Monday, January 20, 2025

పల్నాడులో దారుణం.. కొడుకుని చంపిన తల్లిదండ్రులు

- Advertisement -
- Advertisement -

Parents who killed their son in Palnadu

అమరావతి: పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. డబ్బుల కోసం వేధిస్తున్నాడని తల్లిదండ్రులు కన్న కొడుకుని దారణంగా హత్య చేశారు. గ్రామస్తులకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కథనం ప్రకారం… మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వెండి శ్రీను, రమణమ్మల కుమారుడు వెండి గోపి (20) జులాయిగా తిరిగేవాడు. కనిపించిన వాళ్ల దగ్గర అప్పులు చేసేవాడు. ఊళ్లో కుటుంబం పరువు తీస్తున్నాడనే కోపంతో మూడ్రోజుల క్రితం గోపి కొట్టడంతో మృతిచెందాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మూటకట్టి పొలంలో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News