Thursday, January 23, 2025

రేషన్ కార్డుల కోసం పరేషాన్

- Advertisement -
- Advertisement -

నాచారం: నూతన రేషన్ కార్డుల ప్రక్రియ మొదలైందని ఇక నూతన రేషన్ కార్డులకు, నూతన పేర్లను సైతం చేర్చుకునే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పిన మాటలు గాలికే అన్నట్టు ఉందని ప్రజలు వాపోతున్నారు. మీ సేవా కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. నూతన రేషన్ కార్డుల ప్రక్రియ జూన్ 2వ తేది ప్రారంభం అని చెప్పినప్పటి నుండి మొదులక్కొని మీసేవా కేంద్రాల వద్ద వెళ్లిన ప్రజలకు సర్వర్ పనిచేయడం లేదని చెప్పడంతో ప్రజలు విసిగిపోతున్నారు. సమస్యలతో విసిగిపోతున్న ప్రజలకు టెక్నికల్ సమస్యలను తీర్చుటకు అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక, కనీసం సర్కారు బియ్యం తీసుకొని కడుపునింపు కోవాలి అని ఎదురు చేస్తున్న నిరుపేదలకు ప్రభుత్వం న్యాయం చేయడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పౌర సరఫరాల శాఖ కార్యాలయాల చుట్టు అధికారుల చుట్టు తిరిగిన ఏలాంటి లాభం లేకుండా పోయిందని అంటున్నారు. ప్రతి విధ్యార్ధికి, కుటుంబ సభ్యులకు , ఏక్కడ చూసిన కూడా అత్యవసరం రేషన్ కార్డు, ఆధార్ కార్డు అని చెప్పిన ప్రభుత్వమే రేషన్ కార్డుల ప్రక్రియ మొదలుపెట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి మీసేవాలో, పౌరసరఫరాల అధికారుల కార్యాలయాల్లో పనులు జరిగేలా, రేషన్ కార్డుల ప్రక్రియలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News