Tuesday, December 24, 2024

పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: పరిగి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తండ్రి కొప్పుల హరీశ్వర్ రెడ్డి నారోగ్యంతో కన్నుముశారు. శ్వాస తీసుకోవడంలో హరీశ్వర్ రెడ్డి ఇబ్బంది పడడంతో కుటుంబ సభ్యులు సిపిఆర్ చేస్తూ అంబులెన్స్ లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే పల్స్ ఆగిపోయాయని, శ్వాస సరిగ్గా ఆడక గుండె పోటుతో ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

హరీశ్వర్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, పరిగి బీఆర్ఎస్ నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. హరీశ్వర్ రెడ్డి.. 1994 నుండి 2009 వరకు పరిగి ఎమ్మెల్యేగా తెలుగు దేశం పార్టీ తరుపున వరుస విజయాలు సాధించారు. 2001 నుండి 2003 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ డిప్యూటి స్పీకర్ గా పని చేశారు. సిఎం కేసీఆర్ కు హరీశ్వర్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. 2012లో తెలుగు దేశం పార్టీ వీడి టీఆరెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీఆరెస్స్ పార్టీ నుండి పరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News