Wednesday, January 22, 2025

పరిగి మున్సిపల్ అభివృద్ధికి రూ. 25 కోట్ల నిధులు మంజూరు

- Advertisement -
- Advertisement -
  • జిఓ విడుదలపై మంత్రి కేటిఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి: పరిగి నూతన మున్సిపల్ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రూ. 25 కోట్లు నిధులు మంజూరు చేస్తూ ప్రత్యేక జివోను విడుదల చేయడం సంతోషకరమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు.

శుక్రవారం విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే కెఎంఆర్ మంత్రి కేటిఆర్ చేతుల మీదుగా ప్రత్యేక జిఓ నిధుల విడుదలకు సంబంధించిన ప్రొసిడింగ్ కాపీని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగి మున్సిపల్ అభివృద్ధికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని చెప్పారు. అందుకు మంత్రి కేటిఆర్ రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు.

గతంలో మంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేశారని గుర్తు చేశారు. దీంతో పరిగిలోని 15 వార్డులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని అన్నారు. శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపొతున్న పరిగి అభివృద్ధికి సహకరించి ప్రత్యేక నిధులు మంజూరు చేసిన మంత్రులు కెటిఆర్, సబితారెడ్డిలతోపాటు చేవెళ్ల ఎంపికి ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News