Monday, December 23, 2024

‘పారిజాత పర్వం’ టైటిల్ లుక్ పోస్టర్ విడుదల

- Advertisement -
- Advertisement -

సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారైయింది. ఈ చిత్రానికి ‘పారిజాత పర్వం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంట్రస్టింగా వుంది. ఓ అమ్మాయికి ముసుగు వేసి చైర్ లో బంధించినట్లు విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్ క్యురియాసిటీని పెంచింది. త్వరలోనే మేకర్స్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారు. ఈ చిత్రంలో వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్ , గుండు సుదర్శన్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. బాల సరస్వతి కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. శశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహ నిర్మాత.

తారాగణం: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్ , గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్ ,తోటపల్లి మధు, జబర్దస్త్ రోహిణి

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం – సంతోష్ కంభంపాటి

ప్రొడక్షన్: వనమాలి క్రియేషన్స్

నిర్మాతలు : మహిధర్ రెడ్డి, దేవేష్

సహ నిర్మాత -అనంత సాయి

డీవోపీ-బాల సరస్వతి

సంగీతం-రీ

ఎడిటర్- శశాంక్ వుప్పుటూరి

ఆర్ట్ డైరెక్టర్ – ఉపేందర్ రెడ్డి

డిజైనర్ – చిన్మయి కాకిలేటి

పబ్లిసిటీ డిజైనర్ – అనంత్ కంచెర్ల

సౌండ్ ఎఫెక్ట్స్- పురుషోత్తం రాజు

సాహిత్యం-రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్, రాంబాబు గోసాల

పీఆర్వో -వంశీ శేఖర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News