Wednesday, January 22, 2025

ఇలాంటి దాడులకు భయపడేది లేదు: పారిజాతారెడ్డి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: బడంగ్ పేట్ మేయర్ పారిజాతారెడ్డిని ఐటి అధికారులు తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విమానంలో చెన్నై మీదుగా హైదరాబాద్ కు తీసుకురానున్నట్లు సమాచారం. పారిజాతారెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ… రంగారెడ్డి జిల్లాలో ఒక మహిళా సీటు కేటాయించాలని రాహూల్ గాంధీని కోరానని చెప్పారు. ఓడిపోతామనే భయంతో రాజకీయ కుట్రలో భాగంగా ఐటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

సబితా ఇంద్రారెడ్డి ఓడిపోతుందని సర్వేలు చెప్పాయి. వేలకోట్లు సంపాదించిన, భూకబ్జాలు చేసిన సబితా ఇంద్రారెడ్డి మీద ఐటి దాడులు జరగలేదు.. మేయర్ అయిన నా ఇంటిపైనా దాడులు చేస్తున్నారని పారిజాతారెడ్డి ఫైర్ అయ్యారు. అధికార పార్టీ నేతలపై ఐటి దాడులు చేయకుండా మాపై చేయడం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కుట్ర అన్నారు. మా కార్యకర్తలను బెదిరిస్తున్నారు.. వాళ్లకు ఏమైనా జరిగితే సబితా ఇంద్రారెడ్డే బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News