Sunday, February 23, 2025

నటి పరిణీతి చోప్డా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది!

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇన్నాళ్లు వార్తల్లో నిలిచిన బాలివుడ్ నటి పరిణీతి చోప్డా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఆమెపై వచ్చిన కథనాలన్నీ ఇన్నాళ్లు పుకార్లు అనుకున్నప్పటికీ అవి నిజమేనని తెలుస్తోంది. ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ రాఘవ్ ఛద్దాను ఆమె పెళ్లాడబోతోంది. ఈ విషయాన్ని నటుడు హర్దీ సంధు ఓ ఇంటర్వూలో ధ్రువీకరించారు. ‘చివరికి ఆమె పెళ్లి జరుగబోతున్నందుకు సంతోషిస్తున్నాను. ఆమెకు అంతా బాగా జరగాలని కోరుకుంటున్నాను’ అని అతడన్నాడు. ‘సినిమా సెట్లో పరిణీతి ‘నేను పెళ్లిచేసుకోబోతున్నాను. నాకు సరైన జోడీ దొరికాడనుకుంటున్నాను’ అని తెలిపినట్లు ఆయన వివరించాడు. రాఘవ ఛద్దా, పరిణీతి చోప్డా ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారి అభిరుచులు కూడా ఒకే రీతిలో ఉన్నాయి. వారిక ఒకటవ్వడమే తరువాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News