Sunday, December 22, 2024

రాజకీయ సినీ సమ్మేళన్ రాఘ్‌ణితి..లీలాప్యాలెస్‌లో ఘనమైన పెళ్లి

- Advertisement -
- Advertisement -

ఉదయ్‌పూర్ : ఆప్ ప్రముఖ నేత రాఘవ్ చద్ధా, అందాల నటి పరిణితి చోప్రాల వివాహం జరిగింది. రాజస్థాన్‌లోని రాజరికాల నేపథ్యం ఉండే ఉదయ్‌పూర్‌లో రెండు మూడు రోజుల పాటు సాగిన వేడుకల తరువాత ఆదివారం ఈ చాలారోజుల ప్రేమ జంట ఇప్పుడు భార్యాభర్తలు అయ్యారు. స్థానిక లీలా ప్యాలెస్‌లో రాజకీయ ప్రముఖులు, సినీ టీవీ ప్రముఖుల రాక నేపథ్యంలో వీరు ఒక్కింటి వారయ్యారు. వివాహ వేదిక వద్ద యే జవానీ హై దివానీ వంటి హిందీపాటలు మార్మోగాయి. మధ్యాహ్నం పెళ్లికి ముందు వేడుకలు ఆర్బాటంగా సాగాయి.

పలు అలంకరణలతో కూడిన బారాత్‌లు పడవపై నెమ్మదిగా సాగుతూ వచ్చాయి. మేవార్ రాజస్థానీ సంప్రదాయానికి ఈ పద్ధతి అద్దం పట్టింది. ఢిల్లీ ముఖ్యమంత్ర అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ మాన్ వంటి నేతలు ఇక్కడ సందడి చేశారు. టెన్సిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, క్రికెటర హర్బజన్ సింగ్ , ఆప్ ఎంపి సంజయ్ సింగ్, ఆదిత్యా థాకరే తరలివచ్చారు. పరిణతి బంధువు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి రాలేకపొయ్యారు. వధువు వరుడి పేర్లను తీసుకుని ఈ జంటను వారి బంధువులు ఆప్యాయంగా ‘ రాఘ్‌ణితి ’ అని పిలుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News