Friday, December 20, 2024

క్రీడా సంగ్రామానికి వేళాయే.. గ్రాండ్ గా ఒలంపిక్స్ ప్రారంభోత్సవ సంబరాలు

- Advertisement -
- Advertisement -

పారిస్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా విశ్వ క్రీడా సంగ్రామం (ఒలింపిక్స్)కు శుక్రవారం తెరలేవనుంది. సాయంత్ర 7 గంటల నుంచి ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. సియోన్ నదిలో ప్రారంభోత్సవ సంబరాలు జరుగనున్నాయి. దీని కోసం ఫ్రాన్స్ ప్రభుత్వం, ఒలింపిక్స్ సంఘం కళ్లు చెదిరే ఏర్పాట్లు చేసింది.

గతానికి భిన్నంగా ఈసారి ఒలింపిక్స్ ఆరంభోత్సవ వేడుకలు జరుగనున్నాయి. పారిస్ క్రీడల్లో ప్రపంచ వ్యాప్తంగా 202 దేశాలు పోటీపడనున్నాయి. పారిస్‌తో పాటు ఫ్రాన్స్‌లోని పలు నగరాల్లో ఒలింపిక్స్‌కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నారు. ఈసారి కూడా అమెరికా, చైనాల మధ్య పతకాల కోసం గట్టి పోటీ నెలకొంది. భారత్ కూడా భారీ ఆశలతో బరిలోకి దిగుతోంది. కిందటిసారి సాధించిన ఏడు పతకాల కంటే ఈసారి అధికంగా సాధించాలనే పట్టుదలతో పోరుకు సిద్ధమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News