Sunday, April 6, 2025

ఈ కుట్రలో భాగస్వామ్యం కావొద్దు: పరిటాల సునీత

- Advertisement -
- Advertisement -

అమరావతి: పరిటాల రవి హత్యలోవైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉందని ఎపి ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ నూ సిబిఐ విచారించిందని చెప్పారు. అనంతపురంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియా సమావేశంలో మాట్లాడారు.. రాప్తాడులో తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారని, ఓబుల్ రెడ్డి మద్దెల చెరువు సూరి కుటుంబాలను ఫ్యాక్షనిజంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. తోపుదుర్తి సోదరుల మాటలు నమ్మి ఈ కుట్రలో భాగస్వామ్యం కావొద్దని సునీత కోరారు. జగన్ ను ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ చిచ్చుపెటొద్దు అని పరిటాల సునీత హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News