Friday, April 4, 2025

లంబి స్థానం నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ నామినేషన్

- Advertisement -
- Advertisement -

Parkash Singh Badal files nomination from Lambi

చండీగఢ్ : పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ జలాలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ వేశారు. తాజాగా సుఖ్‌బీర్ సింగ్ తండ్రి , శిరోమణి అకాలీదళ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రకాశ్ సింగ్ బాదల్ కూడా లంబి నియోజక వర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.శిరోమణి అకాలీదళ్ ఈ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలో బహుజన్ సమాజ్ వాది పార్టీతో జట్టుగా బరిలో దిగుతున్నది. ఎప్పుడూ బీజేపీతో పొత్తుపెట్టుకునే ఎస్‌ఏడీ ఈసారి కటీఫ్ చెప్పింది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎస్‌ఏడీ, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగింది. దీనివల్ల రైతుల మద్దతును, బీఎస్పీతో పొత్తు ద్వారా దళిత సామాజిక వర్గం మద్దతును కూడగట్టుకోవచ్చని ఎస్‌ఏడీ భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News