Monday, December 23, 2024

ప్రభుత్వ ఆసుపత్రిలో ….. పార్కింగ్ ఫీజులా

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్దంగా
వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ నిర్ణయం
సర్వత్రా విమర్శల వెల్లువ

Parking fees Charged in Govt hospital

మన తెలంగాణ /సిటీ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రిలో పార్కింగ్ ఫీజులా అంటూ అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అసలే పేదలు, రెక్కాడితే కాని డొక్క నిండని ఈ నిరుపేదలు ధర్మాసుపత్రికి వైద్యం కోసం వస్తే పార్కింగ్ ఫీజుల పేరుతో దండుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బడా బడా కార్పొరేట్ ఆసుపత్రులోనే పార్కింగ్ ఫీజులను ఎత్తివేయడం కాకుండా ఎవరైనా అక్రమంగా వసూళ్లుకు పాల్పడుతన్న వారిపై జిహెచ్‌ఎంసి ఎన్స్‌ఫోర్స్‌మెంట్ సెల్ వేల రూపాయాలు జరిమానా విధిస్తుండగా ఎప్పుడు లేనిది వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో కొత్తగా పార్కింగ్ ఫీజును వసూళ్లు చేయడంపై మండి పడుతున్నారు. ఈ ఏరియా ఆసుపత్రికి వచ్చేది మొత్తం పేదవారే కావడమే కాకుండా కోవిడ్ వాక్సినేషన్ కోసం వచ్చేవారితో పాటు ఆసుపత్రి ప్రాంగణంలోనే వెల్‌నెస్ సెంటర్ కూడా ఉండడంతో ప్రతిరోజు వైద్యం కోసం వందలాది సంఖ్యలో ఉద్యోగులు, జర్నలిస్టులు వస్తుంటారు. వీరంతా కోసం ద్విచక్రవాహనానికి రూ.10లు కారు, ఆటోలకు రూ.15ల చోప్పున ప్రతి మూడు గంటల చెల్లించాల్సి వస్తోంది. అయితే ఇక్కడ ప్రభుత్వం నింబంధనలకు విర్దుద్దంగా పార్కింగ్ ఫీజులను వసూళ్లు చేయడమే కాకుండా చివరికి సైకిళ్లకు సైతం ప్రతి మూడు గంటలకు రూ.5ల చోప్పున పార్కింగ్ ఫీజును వసూళ్లు చేయడంపై మరింత అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

అడ్డగోలు పార్కింగ్ నియంత్రించడానికే: ఆసుపత్రి సూపరిన్‌టెండెంట్ హరిప్రియ

అసలు ఫార్కింగ్ ఫీజును వసూళ్లు చేయడానికి గల కారణం వింటే మరింత విస్మయం కలుగుతోంది. ఆసుపత్రి వైద్యం కోసం వచ్చే వారు తమ వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారని, దీంతో ఆసుపత్రి అభివృద్ది కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆదేశాల మేరకే పార్కింగ్ ఫీజును వసూళ్లు చేస్తున్నట్లు ఆసుపత్రి ఆసుపత్రి సుపరిన్‌టెండెంట్ హరిప్రియ వెల్లడించారు. ఆసుపత్రి అభివృద్ది కమిటీ ఛైర్మన్ స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆసుపత్రికి రావడం, తెలియక కొంత మంది ఆయన కారు అడ్డంగా వాహనాలను పార్కింగ్ చేయడం, దీనిపై ఆయన అగ్రహాం వ్యక్తం చేయడమే కాకుండా వెంటనే పార్కింగ్ ఫీజు వసూళ్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారని ఆసుపత్రి వచ్చే రోగులు ఆరోపించారు.

ఏదిఏమైనా ఆసుపత్రికి వచ్చే వారు ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేస్తే ఇలాంటి చర్యలను నియంత్రించడానికి అవసరమైతే ప్రత్యేకంగా ఓ సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసి క్రమ పద్దతిలో వాహనాలను పార్కింగ్ చేస్తేందుకు చర్యలు తీసుకోవాలి తప్ప పేదలపై భారం మోపే విధంగా పార్కింగ్ ఫీజులను వసూళ్లు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో సినిమా థియేటర్లలో తప్ప మరెక్కడా పార్కింగ్ ఫీజులను వసూళ్లు చేయరాదంటూ ప్రభుత్వమే ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేయగా, అంతుకు విరుద్దంగా ఆసుపత్రి అభివృద్ది కమిటీ ఛైర్మన్ హోదాలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పార్కింగ్ ఫీజు వసూళ్లు చేయాలంటూ అదేశించడంపై అగ్రహాం వ్యక్తం అవుతోంది. వెంటనే ప్రభుత్వ నింబంధనలకు విరుద్దంగా వసూళ్లు చేస్తున్నఫార్కింగ్ ఫీజులను ఎత్తివేసి పేదలపై ఆర్ధిక భారాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News