Monday, December 23, 2024

పిల్లలు, పెద్దల ఆహ్లాదం కోసం పార్కులు : మాధవరం కృష్ణారావు

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భా గంగా సోమవారం బాలాజీనగర్ డివిజన్‌లోని జేఎన్‌యూ ఆర్‌ఎంకాలనీ వద్ద హరిత దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శాసన మం డలి సభ్యులు కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్సీ మమత, కార్పొరేటర్, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కేపీహెచ్‌బికాలనీలోని 3వ ఫేజ్‌లో తెలంగాణ దశాబ్ది పార్కు పేరుతో పార్కును ప్రారంభించారు. పార్కుల అభివృద్ధి కోసం కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కేపీహెచ్‌బి డివిజన్‌లోని పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ పార్కులు ఏర్పాటు చేశామని, ఇండోర్ స్టేడియంలు, షటిల్‌కోర్టు, స్విమ్మింగ్‌పూల్ వంటి అన్ని మౌలిక సదుపాయాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం వ్యాయామం చే స్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్డు పునరుద్ధ్దరణ పనులకు రూ.3కోట్ల 50లక్షలతో శంకుస్థాపన చేసినట్లు వివరించారు.

ఆగస్టు కల్లా పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో బాలాజీనగర్ డి విజన్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబూరావు, మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్, జోనల్‌కమిషనర్ వి.మమత, డీసీతోపాటు ఈఈ సత్యనారాయణ, డిఈ ఆనంద్, ఏఈ సాయి ప్రసాద్, డివిజన్ అద్యక్షులు కృష్ణారెడ్డి, ప్రభాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News