హైదరాబాద్: నగరాన్ని మరిన్ని అందాలు సంతరించుకుంటున్నాయి. ప్లైఓవర్ల క్రింద ప్రాంతాలు పచ్చదనంతో కన్నువిందు చేస్తున్నాయి. జిహెచ్‌ఎంసినగరంలోని పలు ప్లైఓవర్ల క్రింద ప్రత్యేకంగా పార్కులను ఏర్పాటు చేస్తుండడంతో సాయంత్రం వేళా సందర్శకులతో పాటు ప్రయాణికులకు ఆహ్లాదకరాన్ని పంచుతున్నాయి.కాలుష్య నియంత్రణ, ఉష్ణోగ్రత తగ్గించడం, నగర సుందరీకరణ పెంపొందించడం కోసం వివిధ ఫ్లైఓవర్ కింద వర్టికల్ గార్డెన్లను ఆకర్షనీయమైన మొక్కలు నాటుతున్నారు. అంతేకాకుండా ఈ పార్క్‌లో వాకింగ్ ట్రాక్, స్వేద తీరేందుకు ప్రత్యేకంగా సిట్టింగ్ ఏర్పాట్లను కూడా చేశారు. అంతేకాకుండా పచ్చదనాన్ని పెంచేందుకు 13 ప్లై ఓవర్ల పిల్లర్లపై వర్టికల్ గార్డెన్‌తో అలకరించారు. మరింత ఆకర్షనీయంగా మార్చేందుకు వాటర్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు.ప్లైఓవర్ల పక్కనుంచే వెళ్లే వాహనదారులకు స్వచ్చమైన ప్రాణవాయివును అందించడానికి జిహెచ్‌ఎంసి బయోడైవర్సీటి విభాగం ద్వారా వివిధ రకాల పూల మొక్కలను నాటారు. దీంతో స్థానికులకు సైతం ఆహ్లాదకరంగా మారింది.
నగరానికి కొత్త అందాలు.. ప్లైఓవర్ల కింద పార్కులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -