న్యూఢిల్లీ : అదానీ అంశంపై జెపిసి దర్యాప్తునకు ప్రతిపక్షాలు పట్టుపట్టడం, ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవడంతో బుధవారం కూడా పార్లమెంట్ ఉభయసభలో నామామాత్రపు సభా కార్యకలాపాలతో వాయిదా పడ్డాయి. జెపిసి దర్యాప్తు జరిపించాల్సిందేనని లోక్‌సభలో ఉదయం విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్లకార్డులతో నిలిచాయి. దీనితో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తరువాత తిరిగి సమావేశం కాగానే సభలో గందరగోళం నడుమనే కాంపిటిషన్ సవరణ బిల్లు 2022ను ఓటింగ్ నడుమ సభ ఆమోదించింది. కార్పొరేటు సంస్థలు ప్రత్యేకించి ప్రముఖ టెక్ సంస్థలకు సంబంధించి మరింత నియంత్రణలు ఈ బిల్లులో ఉద్ధేశించారు. డీల్ వాల్యూకు సంబంధించి వీటికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) నుంచి ఆమోదాలు తప్పనిసరి చేశారు. రాజ్యసభలో గందరగోళం నడుమ సభను వాయిదా వేశారు. తిరిగి పార్లమెంట్ ఉభయసభలు సోమవారం అంటే ఎప్రిల్ 3వ తేదీన సమావేశం అవుతాయి.
3వ తేదీకి వాయిదా పడ్డ పార్లమెంట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -