Wednesday, January 22, 2025

చట్టసభల్లో కట్టు తప్పొద్దు

- Advertisement -
- Advertisement -

Parliament, assembly are sacred: SC

సభ్యులు రాజనీతిని ప్రదర్శించాలి తప్ప, చిక్కులు సృష్టించొద్దు
కేకలు, వ్యక్తిగత విమర్శలతో జనంలో దురభిప్రాయం
మహారాష్ట్ర అసెంబ్లీలో 12మంది సభ్యులపై ఏడాది సస్పెషన్ రాజ్యాంగ విరుద్ధం
స్పీకర్ నిర్ణయంలో హేతుబద్ధత లేదు : సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పార్లమెంటు, రాష్ట్రాల చట్ట సభలను పవిత్రమైన దేవాలయాలుగా భావిస్తారని, సభను క్రమశిక్షణ లేకుండా గందరగోళంగా నిర్వహించడానికి అవకాశం ఉండకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సభలో సభ్యులు రాజనీతిజ్ఞతను ప్రదర్శించాలే తప్ప చిక్కులు సృష్టించే వారుగా ఉండరాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సభలో జరిగే ఘటనలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబించేవిగా ఉంటున్నాయని, సభలో సభ్యులు నిర్మాణాత్మక చర్చలుకు బదులుగా కేకలు, వ్యక్తిగత విమర్శలతో కాలం వెళ్లబుచ్చుతుండడంతో సభ తన నిర్దేశించిన కార్యకలాపాలను పూర్తి చేయలేకపోతోందనేది జనంలో బలంగా నెలకొంటున్న అభిప్రాయమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 12 మంది బిజెపి శాసన సభ్యులను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ ఎంఎల్‌ఎలు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఏడాది సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధం

గత ఏడాది జులైలో మిగిలిన సమావేశాల కాలానికి మించి మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి 12 మంది బిజెపి సభ్యులను సస్పెండ్ చేస్తూ ఆమోదించిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తప్పుపట్టింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇందులో హేతుబద్ధత లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అసెంబ్లీ స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణపై మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి తమను ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ 12 మంది బిజెపి ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పును వెలువరించింది. గత ఏడాది జులైలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాల మిగిలిన రోజులకు మించి ఏడాది పాటు 12 మంది బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని, ఇది హేతుబద్ధ చర్య కాదని జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్మానాన్ని చట్టవ్యతిరేకమైనదిగా పరిగణిస్తూ కొట్టివేస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సిటి రవికుమార్ ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News